చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి హృదయాల్లోనూ చాక్లెట్ చెరగని ముద్ర వేసుకుంది. 1800 కాలంలో బార్‌లలో అందించే పానీయంగా చాక్లెట్ ప్రారంభమైంది. ఆ తర్వాత అది పలు ఆకారాలుగా మారింది. రంగులను మార్చుకుంది. నట్స్‌ను చేర్చుకుంది. పండ్లను యాడ్ చేసుకుంది. వివిధ రకాలైన రుచుల్లో అందరికీ దగ్గరైంది.
ప్రపంచవ్యాప్తంగా.తమిళనాడులోని నీలగిరి జిల్లాలో తయారు చేసే చాక్లెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు నీలగిరి జిల్లాను సందర్శిస్తారు. వాటిని తయారు చేసే ప్రక్రియను, ఫ్యాక్టరీలను వీక్షించేందుకు వారు ఆరాటపడతారు.
నీలగిరిలో 60 రకాల చాక్లెట్లు తయారు చేస్తారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా చాక్లెట్లు కూడా ఇక్కడ తయారుచేస్తారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు చాక్లెట్లు తింటే ఒత్తిడి పోతుందని తయారీదారులు చెబుతున్నారు.