లక్ష్మీదేవికి శుభ్రంగా వున్న ఇల్లు అంటే చాలా ఇష్టం. అందుకే దీపావళికి ముందు నాలుగు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదు.. పనికిరాని వస్తువులను ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పగిలిన అద్దం ఇంట్లో ఉంచితే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండటమే కాకుండా మనస్ఫర్థలు వస్తాయి. ఇంట్లో మంచం విరిగి ఉన్నా శబ్దాలు వస్తున్నా వాటిని బాగు చేయించాలి..లేకుంటే బయట పడేయాలి.
ఆగిపోయిన గడియారం.. విరిగిన గడియారం ఉంటే పడేయాలి.. లేకుంటే ఏ పని మొదలెట్టినా ఆటంకాలు వస్తాయి. చెద పట్టిన ఫోటోలు ఉంటే బయట పడేయాలి. ఇంటి ముఖ ద్వారానికి రిపేర్లు ఉంటే చేయించాలి. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు విరిగిపోయి వుంటే వాటిని కూడా పడవేయాలి. చిరిగిన బట్టలు పడవేయాలి. ఇవన్నీ ఇంట్లో ఉంటే లక్ష్మి ఇంటికి రాదు. గత యేడాది వాడిన దీపాలను మళ్ళీ వాడకూడదు. ఎవరి శక్తికొద్దీ వారు కొత్త దీపాలను కొనుగోలు చేసి దీపావళిని చేసుకుంటే మహాలక్ష్మి కటాక్షిస్తుంది.