చిత్తూరులో నారా లోకేష్... కడపలో జగన్ రోడ్ షో... జన ప్రభంజనం...

శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (16:17 IST)
WD
2014 ఎన్నికలు నేపధ్యంలో సీమాంధ్రలో తెదెపా వర్సెస్ వైకాపాగా ప్రచారం సాగుతోంది. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తున్నా జనం భారీగా హాజరవుతున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి జగన్ కడప పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూడళ్లు పూర్తిగా జన సంద్రమైపోతున్నాయి.

WD

మరోవైపు చిత్తూరులో నారా లోకేష్ యువ ప్రభంజనం యాత్ర సాగిస్తున్నారు. ఇక్కడ కూడా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఐతే ఏ నాయకుడు సీమాంధ్రకు న్యాయం చేస్తాడో ఎవరికి ఓటు వెయ్యాలన్నది ఇపుడు సీమాంధ్ర ప్రజల ముందు ఉన్న పెద్ద సవాల్. మరి ఎవరికి పట్టం కడతారో వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి