టిడిపి తరపున ప్రచారానికి ఎన్టీఆర్ టైమ్ షెడ్యూల్... రెడీ
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (20:24 IST)
WD
తెదేపాకు టాలీవుడ్ హీరో పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలా మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారో లేదో ఇలా జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేయడానికి రంగంలోకి దిగుతున్నట్లు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి సంబంధించిన రూట్ మ్యాప్ తెదేపా సిద్ధం చేసేసినట్లు చెపుతున్నారు.
అటు నట సింహం బాలకృష్ణ ఉత్తరాంధ్రలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బాలయ్య అల్లుడు నారా లోకేష్ టిడిపికి ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇంకా గల్లా జయదేవ్ కు ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ప్రచారం అందిస్తున్నాడు. ఇలా మొత్తమ్మీద టిడిపిని గెలిపించేందుకు సినిమా తారలు ఒక్కరొక్కరుగా రంగంలోకి దూకుతున్నారు. మరి ఈ తళుకుబెళుకు తారల సందడికి ఓటర్ల ఓట్లు రాలుతాయో లేదో చూడాలి.