గుర్తో గుర్తుంచుకోండి... సైకిల్ గుర్తు... నటుడు తొట్టెంపూడి వేణు

శనివారం, 19 ఏప్రియల్ 2014 (15:38 IST)
WD
హనుమాన్ జంక్షన్ చిత్రం ద్వారా కామెడీని తనదైన శైలిలో పండించిన సినీ నటుడు వేణు తొట్టెంపూడి ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థిని గెలపించాలంటూ ప్రచారం చేశారు. ఖమ్మంలో వేణు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ అనీ, ఆ గుర్తుపై అంతా ఓటు వేసి గెలిపించాలన్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలో నడిపించాలంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలరని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం ద్వారా రాష్ట్రాన్ని సుపరిపాలన చేయగల నాయకుడిని ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి