మాజీమంత్రి పార్ధసారథి భార్య రూ.45 లక్షలతో పట్టుబడింది...
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (12:39 IST)
FILE
ఎన్నికలు 2014కు మరికొద్ది రోజులే ఉండటంతో నగదును భారీస్థాయిలో తరలించడం ఎక్కువైంది. తాజాగా మాజీ మంత్రి పార్ధసారథి సతీమణి కమల రూ.45 లక్షల తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆమె ఈ డబ్బును ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వదిలిపెట్టారు.
హైదరాబాద్ వనస్థలిపురంలో కమల ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేయగా ఈ నగదు లభ్యమైంది. కాగా మాజీమంత్రి పార్ధసారథి మచిలీపట్నం లోక్ సభ స్థానానికి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిన విషయమే.