వజ్ర ఆభరణాలను ఎలా శుభ్రం చేస్తున్నారు?

సోమవారం, 11 ఆగస్టు 2014 (15:13 IST)
వజ్ర ఆభరణాలను ఎలా శుభ్రం చేస్తున్నారు? ఏవో సబ్బు నురుగులో నానబెట్టి పొడి బట్టతో తుడిచేస్తున్నారా? అయితే ఈ కథనం చదవండి. వజ్రాల ఆభరణాలను శుభ్రం చేయాలంటే ముందుగా వాటిని పదిహేను నిమిషాలపాటు నీటిలో నానబెట్టండి. 
 
వేరొక పాత్రలో నీటిని పోసి అందులో వాషింగ్ పౌడర్ మరిగించిన తర్వాత ఆభరణాలను వేసి ఐదు నిమిషాలపాటు ఉంచండి. నీటిలో నుంచి తీసిన తర్వాత నీటిధార కింద పెట్టి జాగ్రత్తగా రుద్ది కడగాలి. దీంతో మీ ఆభరణాలు తళతళలాడుతుంటాయి. 
 
* వెండి పాత్రలు, ఆభరణాలు తళతళ మెరవాలంటే ఉప్పుతో కాని బూడిదతో కాని శుభ్రం చేయండి. దీంతో మీ వెండి పాత్రలు ధగధగ మెరుస్తుంటాయనడంలో సందేహం లేదు. 

వెబ్దునియా పై చదవండి