హిట్ టాక్ పిక్చర్స్ పతాకంపై డి.గోపికృష్ణ-గంగపట్నం శ్రీధర్ నిర్మాతలుగా హారిక్ దేవభక్తుని దర్శకత్వంలో తెరకెక్కిన 'కిరాక్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకిరానుంది. ఇందులో చక్కని క్యారెక్టర్ చేశాను. అలాగే మరో రెండు సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నాను. కథానాయికగా తెలుగులో నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది. మంచి అవకాశాలొస్తున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు చాందిని.
కిరాక్ పంచ్ కొట్టు.. పోరిని పట్టు... హారిక్ దేవబత్తుల
కన్న కూతురు తప్పిపోతే తల్లిపడే ఆవేదన, పవన్ కళ్యాణ్ ఫ్యాన్...మహేష్ బాబు ఫ్యాన్ అయిన అమ్మాయిని ప్రేమలో పడేయడానికి చేసే ఆలోచన, 15 ఏళ్ళ క్రితం తప్పిపోయిన పాప ఎవరు అని హీరో చేసే ప్రయత్నం. ఈ మూడింటి కలయికే కిరాక్ చిత్రం. చక్కని రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేస్తాం.
అలాగే ప్రమోషన్లో భాగంగా 'కిరాక్ పంచ్ కొట్టు... పోరిని పట్టు' అనే ఓ కాన్సెప్ట్‌ని త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఎవరైనాగానీ తమకి ఇష్టమైన వాళ్ళ గురంచి ఓ పంచ్ డైలాగ్ రాసి, లేదా రికార్డ్ చేసి కిరాక్ ఫేస్బుక్ ఫేజ్‌లో పోస్ట్ చేస్తే... మాకు నచ్చిన డైలాగ్‌ని సెలెక్ట్ చేసి వారికి బహుమతులు అందచేస్తాం అని తెలిపారు.