ప్రతిరోజూ రాత్రి వెన్నను పెదాలకు రాసుకుంటే?

శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:25 IST)
ప్రతిరోజూ రాత్రిళ్లు ఏం చేయాలంటే.. అర చెంచా వెన్నకు కాస్త తేనె కలిపి పెదాలను రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదవులు మృదువుగా మారతాయి. త్వరగా పొడిబారవు. అలాగే రాత్రి నిద్రించేముందు... చెంచా గ్లిజరిన్‌లో అరచెంచా తేనె కలిపి పెదవులకు రాసుకోవాలి. ఇలా చేస్తే అధరాలు మృదువుగా ఉంటాయి. 
 
* అలాగే దోసకాయ కూడా అధరాల పోషణకు చక్కగా పనిచేస్తుంది. ఏం చేయాలంటే.. తరచూ దోసకాయ ముక్కతో పెదవుల్ని రుద్దాలి. ఇలా చేస్తే పెదవులు లేత గులాబీ వర్ణంలోకి మారతాయి. 
 
* ఆముదంలో తేమకారక గుణాలు అధికం. అందుకే ఈ నూనెను కూడా... అధరాల సంరక్షణకు ఉపయోగించవచ్చు. అయితే వాసన పడని వారు ఏం చేయవచ్చంటే... నూనెను కాస్త తేనె కలిపి రాసుకోవాలి. ఇది చక్కని మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. 
 
* కాసిన్ని గులాబీరేకుల్ని మెత్తగా రుబ్బి... అందులో చెంచా గ్లిజరిన్ కలపాలి. దాన్ని పెదవులకు పట్టించి.. సున్నితంగా మర్దన చేయాలి. చక్కని నిగారింపును సంతరించుకుంటాయి. పెదవులు పొడిబారవు. 

వెబ్దునియా పై చదవండి