పొడిచర్మం కలిగివున్నవారు చలికాలంలో మాయిశ్చరైజర్ వాడాలని బ్యూటీషియన్లు అంటున్నారు. చర్మం పగలకుండా వుండాలంటే మాయిశ్చరైజర్లు వాడాలి. సన్‌స్క్రీన్ క్రీమ్‌లు వాడాలి. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చలికాలంలో పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం..కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దనా చేయాలి. తద్వారా మృతకణాలు తొలగిపోయి.. చర్మం మృదువుగా తయారవుతుంది.