చికెన్ నగెట్స్‌ ఎలా చేయాలో మీకు తెలుసా?

FILE
ప్రస్తుతం యంగ్ అండ్ ఏజ్డ్ పీపుల్ దాకా అందరూ బర్గర్, పిజాలను తీసుకోవడం అలవాటు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చాలామంది చికెన్ నగెట్స్‌ను లాగిచ్చేస్తున్నారు. చికెన్ నగెట్స్‌ను ఇంట్లోనే చేయాలంటే ఎలాగో చూద్దామా..

చికెన్ నగెట్స్‌కు కావలసిన పదార్థాలు :
చికెన్ - రెండు కప్పులు
మిరియాల పొడి - రెండు స్పూన్లు
గరం మసాలా - అర కప్పు
బ్రెడ్ పొడి - అర కప్పు
కార్న్‌ఫ్లోర్ - మూడు స్పూన్లు
ఉప్పు, నూనె- తగినంత

తయారీ విధానం :
ముందుగా చికెన్‌ను శుభ్రంచేసి అందులో మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలాను చేర్చి గ్రైండ్ చేసుకోవాలి. మరో పాత్రలో కార్న్ ఫ్లోర్‌ను నీటితో జారుగా పిండిలా కలుపుకోవాలి. గ్రైండ్ చేసిన చికెన్ ముద్దను గుండ్రంగా చేసి కార్న్ ఫ్లోర్‌లో అద్ది, తర్వాత బ్రెడ్ పొడిలోనూ అద్దుకుని.. ఓ ప్లేటులోకి తీసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక చికెన్ ముద్దలను గోధుమ రంగు వచ్చేంతవరకు వేయించి సాస్‌తో సర్వ్ చేయాలి.

వెబ్దునియా పై చదవండి