మేరా ఇడ్లీ మహాన్‌... "పెసరపప్పు ఇడ్లీ"

FILE
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు.. ఒక కప్పు
పచ్చిమిర్చి.. ఆరు
ఇంగువ.. చిటికెడు
కొబ్బరి.. ఒకటిన్నర టీ.
వంటసోడా.. పావు టీ.
ఉప్పు.. ఒక టీ.
నూనె.. ఒకటిన్నర టీ.
పెరుగు.. అర కప్పు
ఆవాలు.. పావు టీ.

తయారీ విధానం :
పెసరపప్పుని మూడుగంటలపాటు నాననివ్వాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు కలిపి రుబ్బాలి. పప్పుని విడిగా నీళ్లు లేకుండా రుబ్బాలి. ఈ రెండు మిశ్రమాల్ని పెరుగు వేసి కలపాలి. ఓ బాణలిలో నూనె వేసి ఆవాలు వేయాలి. తరువాత పిండి మిశ్రమం, సోడా కూడా వేసి బాగా కలిపి కొద్దికొద్దిగా ఇడ్లీ రేకుల్లో వేసి ఉడికించాలి. ఈ పిండి పులియాల్సిన అవసరం లేదు. అలాగే వేసినా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి