రంజాన్‌ మాసం స్పెషల్ ఫుడ్... "తూతక్‌"

FILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ.. అర కేజీ
నెయ్యి.. 75 గ్రా.
ఉప్పు.. తగినంత
వంటసోడా.. చిటికెడు
మటన్ కీమా.. 300 గ్రా.
ఉల్లిపాయలు.. రెండు
కారం.. అర టీ.
అల్లంవెల్లుల్లి.. అర టీ.
నిమ్మరసం.. ఒక టీ.
కొత్తిమీర.. ఒక కట్ట
నూనె.. రెండు టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
గరంమసాలా.. అర టీ.
నూనె.. తగినంత

తయారీ విధానం :
బొంబాయిరవ్వలో నెయ్యివేసి కలియబెట్టి ఉప్పు, వంటసోడా వేసి కొన్ని నీళ్లు చల్లి ముద్దలా కలపాలి. దీన్ని పన్నెండు ముద్దలుగా విడదీసి తడి వస్త్రంతో కప్పి ఉంచాలి. మటన్‌కీమాను ఉడికించి పక్కన ఉంచాలి. ఓ బాణలిలో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించి అల్లంవెల్లుల్లిముద్ద, కారం, ధనియాలపొడి, ఉప్పు కలిపి మటన్ కీమా కూడా కలిపి పొడిపొడిలాడేలా వేయించాలి.

దీనిని ఓ గిన్నెలోకి తీసి నిమ్మరసం, కొత్తిమీర చేర్చాలి. పిండిముద్దను పలచగా వత్తి కీమా కూరను దాని మధ్యలో ఉంచి అన్ని వైపులా మూసేసి దగ్గరగా చేసి కోడిగుడ్డు ఆకారంలో చుట్టి కాస్త చేత్తో వత్తాలి. ఓ బాణలిలో నూనె వేసి సన్నని మంటమీద ఈ తూతక్‌లను బంగారురంగులో వేయించి తీసి పుదీనాచట్నీతో వడ్డించాలి. అంతే గరమ్ గరమ్ తూతక్ రెడీ..!

వెబ్దునియా పై చదవండి