చీజ్ పాలక్ దోసె తయారీ ఎలా?

శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:47 IST)
కావలసిన పదార్థాలు :
దోసెపిండి... 3 కప్పులు
పాలకూర పేస్ట్... సరిపడినంత
తాళింపు దినుసులు... సరిపడినన్ని
చీజ్... రెండు టేబుల్ స్పూన్లు
 
తయారీ విధానం :
కడాయిలో ఆయిల్ వేడిచేసి తాలింపు దినుసులు వేసి వేయించాక... పాలకూర పేస్ట్ వేసి సన్నని సెగమీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పెనంపైన దోసెవేసి దోరగా వేగాక తురిమిన చీజ్ చల్లి ఆపై పాలకూర పేస్ట్ కోటింగ్‌లా వేసి దోరగా కాల్చాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి