కోడిగుడ్డును రోజుకొకటి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడే కోడిగుడ్డులో పోషకాలు దాగివున్నాయి. కోడిగుడ్డులో 11 రకాల ఆమ్లాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీనులు, విటమిన్ ఏ, బీ, డీ, ఈ, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, తదితర పలు రకాల పోషక పదార్థాలు గుడ్డులో సమృద్ధిగా ఉన్నాయి. గుడ్డులోని విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపర్చడానికి, విటమిన్ డీ ఎముకల ధృఢత్వానికి, విటమిన్ ఈ కాన్సర్ నుండి కాపాడడంతోపాటు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. అలాంటి కోడిగుడ్డుతో వెరైటీగా కట్ లెట్ తయారీ ఎలాగో చూద్దాం..
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు
పచ్చి మిర్చి పేస్ట్ - ఒక టీ స్పూన్
కరివేపాకు పేస్ట్ - పావు టీ స్పూన్
తయారీ విధానం : స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేడయ్యాక అందులో ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముద్ద, కరివేపాకు తరుగూ, కాస్త ఉప్పూ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపూ, కారం, ధనియాలపొడీ, గరంమసాలా వేయాలి. అందులో ఉడికించి బంగాళాదుంప వేసి మరొకసారి కలపాలి. చివరగా ఉప్పు సరిచూసి కొత్తిమీర చల్లి బాగా కలిపి దించేయాలి.
చేతికి నూనెను రాసుకుని ఆలూ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఆ ముద్దలో కోడిగుడ్డును స్టఫ్ చేయాలి. ఇలాగే మిగిలిన కోడిగుడ్లను చేసుకోవాలి. ఆపై గిలకొట్టిన గుడ్డు సొనలో దీన్ని ముంచి, బ్రెడ్ పొడిలో అటు ఇటు దొర్లించాలి. ఇలా చేసుకున్న వాటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని వేడి వేడిగా టమోటా సాస్‌పై సర్వ్ చేస్టే టేస్ట్ అదిరిపోతుంది.