చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. తద్వారా గుండెపోటు హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మెదడుకు మేలు చేసే చేపలు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. టైప్-1 డయాబెటిస్, పిల్లల్లో ఆస్తమాను చేపలు దరిచేరనివ్వవు. నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు. అలాంటి చేపలతో కూర, ఫ్రై చేసి బోర్ కొట్టేసిందా.. అయితే ఈసారి ఫిష్ టిక్కా ట్రై చేయండి.
వెనిగర్ - అర స్పూన్
తయారీ విధానం :
ఓ వెడల్పాటి పాత్రలో పెరుగు, ఆవాల పొడి, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి, పసుపు, వెనిగర్, అల్లం వెల్లుల్లి ముద్దను బాగా మిక్స్ చేయాలి. ఇందులో ముళ్లు లేని శుభ్రం చేసిన చేప ముక్కలకు పట్టించి.. అరగంట పాటు పక్కనబెట్టేయాలి. ఆపై బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దట్టించిన చేప ముక్కలను స్క్యూవర్ కమ్మీలకు గుచ్చి.. ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. ఈ ముక్కలు ఉడికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆపై సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని గ్రీన్ చట్నీతో రుచి చూడాల్సిందే.