హెల్దీ స్నాక్స్ : అరటికాయ కట్‌లెట్స్ ఎలా చేయాలి?

బుధవారం, 13 మే 2015 (18:58 IST)
అధిక పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా ఉండే అరటికాయతో హెల్దీ స్నాక్స్ అరటికాయ కట్ లెట్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
అరటి కాయలు - మూడు
బంగళాదుంప - ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు 
ఉప్పు, నూనె- తగినంత 
బ్రెడ్ పొడి - అరకప్పు 
 
తయారీ విధానం :
పచ్చి అరటి కాయలు, బంగాళా దుంపల్ని కుక్కర్లో వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు ఉడికించాలి. పచ్చి మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటి, బంగాళాదుంప గుజ్జులో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి చిన్న చిన్న ఉండలు చేసుకుని అరచేతిలో పెట్టి నొక్కి బ్రెడ్ పొడిలో అద్దాలి. వీటిని బాణలిలో వేసి నూనెతో దోరగా వేపి.. టొమేటో సాస్ లేదా మింట్ సాస్ నంజుకుని తింటే రుచిగా వుంటాయి. 

వెబ్దునియా పై చదవండి