కొవ్వును కరిగించే పనీర్‌తో బ్రెడ్ శాండ్‌విచ్ ఎలా చేయాలి?

గురువారం, 4 ఫిబ్రవరి 2016 (17:52 IST)
పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో పుష్కలమైన పోషకాలున్నాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. దంతాలను గట్టిపరిచే పనీర్‌ను మాసానికి రెండు సార్లు డైట్‌లో చేర్చుకోవాలి. లో క్యాలరీలతో కూడిన పనీర్ కొవ్వును కరిగిస్తుంది. గుండెపోటు, క్యాన్సర్ వ్యాధులను దూరం చేస్తుంది. అలాంటి పనీర్‌తో వెరైటీగా పనీర్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు - పది
పన్నీర్- 150- గ్రాములు 
ఉల్లిపాయ- ఒకటి
సెనగపిండి - 100గ్రాములు
ఉప్పు- తగినంత
మంచినీళ్లు- కప్పు
నూనె- వేయించడానికి సరిపడా
కారం- టీస్పూను
అల్లంవెల్లుల్లి - అరటీస్పూను
 
తయారీ విధానం :
ముందుగా బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్- ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత పనీర్, ఉప్పు, కారం, గరంమసాలా చేర్చి ఐదు నిమిషాలు వేయించి పక్కన పెట్టాలి. బ్రెడ్ ముక్కల అంచులు తీసేసీ వీటిని త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. విడిగా చిన్న గిన్నెలో చిటికెడు ఉప్పు, కొద్దిగా బియ్యపిండి, తగిన నీళ్లు పోసి గట్టి పేస్టులా చేసి పన్నీర్ ముక్కల మిశ్రమంలో కలపాలి. 
 
కత్తిరించిన ఓ బ్రెడ్‌ముక్కను తీసుకుని దాని మీద మిశ్రమాన్ని పలుచగా పూసి పైన మరో బ్రెడ్ ముక్క పెట్టి శాండ్‌విచ్‌లా తయారుచేయాలి. ఇలా మొత్తం బ్రెడ్‌ముక్కలని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక స్టౌ మీద బాణలి పెట్టి నూనె కాగాక బ్రెడ్ ముక్కలను వేసి ఎర్రగా వేయించి తీయాలి. టమాటో సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.

వెబ్దునియా పై చదవండి