స్టఫ్డ్ చిల్లీ సాస్ రోటీ ఎలా తయారు చేస్తారు?

సోమవారం, 14 ఏప్రియల్ 2014 (15:45 IST)
File
FILE
కావలసిన వస్తువులు :
మైదా : 1/2 కప్‌
రవ్వ : 1/2 కప్‌
బియ్యప్పిండి : 1/2 కప్‌
ఉప్పు : 1/2 టీస్పూన్‌
నూనె : అవసరమైనంత మేరకు
మంచి నీళ్ళు : 2 కప్పులు
చిల్లీ సాస్ ఒక కప్

తయారీ విధానం:
మైదా, రవ్వ, బియ్యప్పిండి మూడింటినీ కలపండి. ఒక పాన్‌లో వేసి నీళ్ళు పోసి, అందులో ఉప్పు వేసి, ఒక టీస్పూన్‌ నూనెను కూడా కలిపి వేడిచేయండి. నీళ్ళు వేడెక్కిన తర్వాత పిండిని కూడా చేర్చి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. తర్వాత కిందకు దించి పిండి గడ్డలు కట్టకుండా గరిటెతో బాగా కలపండి. వేడి తగ్గిన తర్వాత ఆ పిండిలో చిల్లీ సాస్‌ను చేర్చి చపాతి పిండిలా తయారు చేసుకోండి. అవసరమైతే నీరు కలుపుకోవచ్చు.

ఈ పిండిని ఉండలుగా చేసి, చపాతీల్లా రుద్ది బియ్యప్పిండిలో పొర్లించి పక్కన పెట్టుకోండి. పెనముపై నూనె వేసి వేడయ్యాక ఆ చపాతీలను ఇరువైపులా బ్రౌన్‌గా వచ్చేంతవరకు వేయించండి. ఈ రోటీలు సాఫ్ట్‌గా ఉండటంతో పాటు రుచికరంగా ఉంటాయి. ఈ రోటీలకు ఆలు కూరతో గానీ, టమోటా సాస్‌తో గానీ సర్వ్ చేయొచ్చు.

వెబ్దునియా పై చదవండి