ఉగాది పచ్చడి రుచిచూడండి.. ప్రాముఖ్యతేంటో తెలుసుకోండి

FILE
హిందూ సంప్రదాయం ప్రకారం 64 నామసంవత్సరాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు తన సృష్టిని బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించడంతోనే ఆ రోజు యుగమునకు ఆది- యుగాదిగా కాలక్రమమున ఉగాదిగా మారింది.

ఉగాది రోజున వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది.

ఆ రోజున చేసే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ఇంకా చదవండి ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో జరిగ వివిధ అనుభవాలకు ఉగాది పచ్చడి ప్రతీక. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక -
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు
ఉప్పు - జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఎనీ వే అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు.

వెబ్దునియా పై చదవండి