నాగపంచమి, వరలక్ష్మీ వ్రత విశిష్టత- పూజా విధానం!

FILE
నాగపంచమి ఈ నెల 11వ తేదీ. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం ఈ పండుగ విశిష్టత. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ ప్రతిమలకు భక్తులు అభిషేకం చేస్తారు.

అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం (ఆగస్టు 14)రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు.

ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుషు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శనిగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మీ రూపంగాదలిచి గౌరవిస్తారు.

వెబ్దునియా పై చదవండి