మహాశివరాత్రి రోజున సాయంత్రం.. ఇలా చేస్తే..?

సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:00 IST)
ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనినే మాసశివరాత్రి అంటారు. ఈ రోజున శివునికి ఆలయాల్లో విశేష పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రిని చాలా విశిష్టమైనదిగా పండితులు చెప్తున్నారు. ఓ రోజూ పార్వతిదేవి ఈశ్వరుని శివారాత్రి గురించి అడుగుతారు. అప్పుడు శివుడు ఇలా అంటారు.. శివరాత్రి ఉత్సవం నాకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ ఒక్క రోజు మాత్రం ఉపవాసమున్నాసరే నాకెంతో సంతోషంగా ఉంటుందని చెప్తారు.
 
ఈశ్వరుడు చెప్పిన మాట ప్రకారం పార్వతీ ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో ఆ తరువాత పెరుగుతో, ఆపై నేతితే, తేనెతో అభిషేకం చేస్తారు. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి ఆమె భుజించే శివరాత్రి వ్రతం సమాప్తి చేస్తుంది. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటారు పరమేశ్వరుడు. 
 
మహాశివరాత్రి నాడు ఉదయం 5 గంటలకు నిద్రలేచి.. శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆపై తెలుపు రంగు బట్టలను ధరించి.. శివుని మాటలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.
 
ఇక మారేడు దళాలు, తెల్లపువ్వుల మాలతో భోళాశంకరుని అలంకరించి.. నైవేద్యంగా పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సమ్పరించి నిష్టతో పూజించాలని పండితులు చెప్తున్నారు. పూజ సమయంలో శివఅష్టోత్తరం, శివపంచాక్షరీ మంత్రాలను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు, సిరిసంపదలు చేకూరుతాయని వారు చెప్తున్నారు. 
 
చివరగా నిష్టతో ఉపవాసముండి శివసహస్త నామం, శివ పురాణం, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో స్వామివారికి పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు