రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగ. ప్రతీ ఏటా శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు మన దేశం మొత్తం రాక్షా బంధన్ జరుపుకుంటుంది. సోదరి రాఖీని తన సోదరుడికి కడుతుంది. అయితే.. పౌర్ణమి అంటేనే చంద్రుడు నిండు ప్రకాశంతో వెలుగుతూ కనిపిస్తాడు.
రాఖీ అంటే నిండు ప్రకాశం గత చంద్రుడని అర్థం. అందుకే మనిషి ఆత్మలను చంద్రుడితో పోలుస్తారు. మనిషి ఆత్మలు జనన, మరణ కాలచక్రంలోకి రావడం వల్ల తమకు ఉన్న ప్రకాశం, పవిత్రతను కోల్పోతాయట. అంటే మనిషిగా పుట్టారంటే ఆ ఆత్మకు ప్రకాశం ఉండదు. పవిత్రత ఉండదు. దీంతో మనిషిగా ఉన్నప్పుడే మనిషి ఆత్మను ప్రకాశింపజేయడం కోసం సోదరి రూపంలో దేవుడు ఈ రాఖీని కట్టిస్తాడట.