రక్షాబంధన్ కట్టిన సోదరికి..బ్రదర్స్ ఎలాంటి కానుకలు ఇవ్వొచ్చు?

శనివారం, 22 ఆగస్టు 2015 (17:16 IST)
రక్షకావాలంటూ రక్షాబంధన్ రోజున సోదరి రాఖీ కడితే సోదరులు ఎలాంటి కానుకలు ఇవ్వాలని టెన్షన్ పడిపోతుంటారు. అలాంటి వారు మీరైతే ఈ కథనం చదవండి. అమ్మాయిలు ట్రెడిషనల్ డ్రెస్‌లంటే తెగ ఇష్టపడతారు. అందుచేత దుస్తులు కొనిపెట్టవచ్చు. గోల్డ్ పెండెంట్లు, సిల్వర్ చైన్లు వంటివి కొనిపెట్టవచ్చు. చాక్లెట్ బాక్సులు, పుస్తకాలు చదివే ఆసక్తి వుంటే మంచి పుస్తకాలను కానుకలుగా ఇవ్వొచ్చు.
 
ఇక బొమ్మలు, టెడ్డీస్.. ఆఫీస్, కాలేజ్, స్కూల్స్‌కు వెళ్లేవారికి అనుగుణంగా బ్యాగ్స్, బాటిల్స్, లంచ్ బాక్సులు వంటి ఉపయోగకరమైన వాటిని కూడా కానుకలుగా ఇవ్వడం చేయొచ్చు. అలాగే వాక్‌మన్, బ్లూటూత్ డివైస్, మొబైల్ ఫోన్.. ఇంటికి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవన్నీ కుదరకపోతే.. వంద, వెయ్యి, మూడు వేలు ఇలా బడ్జెట్‌కు కుదిరినంత డబ్బును చేతులో పెట్టేయవచ్చని పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి