పితృరుణం తీర్చుకోవాలంటే.. సంక్రాంతి రోజున..?

మంగళవారం, 13 జనవరి 2015 (17:32 IST)
పితృరుణం తీర్చుకోవాలంటే సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పిండోదక దానాలు, శ్రాద్ధ కర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల రుణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. 
 
మకర సంక్రాంతి నాడు తెలకపిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయడం ఆచారం. ఎందుకంటే మకర రాశికి శని అధిపతి. శని వాత ప్రధాన గ్రహమని చెప్పబడింది. 
 
వాతం తగ్గాలంటే సంక్రాంతి నాడు తెలకపిండితో స్నానం చేసి, నువ్వులు బెల్లం గుమ్మడి కాయ మొదలైన దానాలు ఇవ్వడమే ఇందుకు పరిహారమని పండితులు చెబుతున్నారు. అందుకే సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లంతో చేసిన అరిసెలు మొదలైనవి తింటారు

వెబ్దునియా పై చదవండి