బంగారం ధరలు పైపైకి...!

FILE
దేశీయ బంగారం మార్కెట్లో పసిడి ధర రోజురోజుకు ఎగబాకుతోంది. గత కొద్ది రోజుల క్రితం బంగారం ప్రతి 10 గ్రాములు రూ. 16000ల స్థాయిని దాటింది. మళ్ళీ వెంటనే ధరలు కాస్త తగ్గుముఖం పట్టింది. తిరిగి మళ్ళీ ధరలు పుంజుకోవడం ప్రారంభమైంది. ఇదే బంగారం ధర దీపావళి పండుగ నాటికి మళ్ళీ రూ. 16000లకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం డాలర్ సాధించిన కౌంటర్ ర్యాలీ కారణంగా గత వారం స్వల్ప కాలం పాటు బంగారం ధర తగ్గుముఖం పట్టిందని బులియన్ వర్గాలు అంటున్నాయి. కాని డాలర్ మరోసారి బలహీనపడుతోందని, ఇది బంగారానికి సానుకూలమైన ధరలు వచ్చే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

ప్రస్తుతం అక్టోబర్‌లో వచ్చే దీపావళి పండుగ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి ఔన్సు బంగారం 1020 డాలర్లకు చేరవచ్చని, అదే దేశీయ మార్కెట్లో మాత్రం డాలర్‌తో కారణంగా రూపాయి బలపడుతున్న తీరు ఆధారంగా బంగారం ధర తగ్గకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బుధవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ప్రతి ఔన్సు బంగారం ధర 1001 డాలర్లుండగా దేశీయ విపణిలో 10 గ్రాములు బంగారం ధర రూ. 15,585లకు చేరుకుంది. దీంతో రానున్న రెండు వారాల్లో బంగారం ధరలు మళ్ళీ పుంజుకోనున్నాయని, అది దీపావళి పండుగ సీజన్‌కే మరింత వృద్ధి చెందవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి