వైజాగ్‌ నగరంలో సూక్ష్మ వ్యాపారవేత్తల కోసం ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌

మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:20 IST)
ఆతిథ్య రంగ పరిశ్రమ, తమ చరిత్రలోనే అత్యంత భారీ మార్పులను చేసుకుంటుందిప్పుడు. కోవిడ్‌ 19 మహమ్మారి ఇప్పుడు వినియోగదారుల ప్రవర్తన పరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. మరీ ముఖ్యంగా ప్రయాణాలు మరియు ఆతిథ్యరంగం పరంగా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
 
అత్యున్నత పరిశుభ్రతా ప్రమాణాలు, అతి తక్కువగా తాకే సేవలు మరియు మెరుగైన విశ్వసనీయత అనేవి దేశం అన్‌లాక్‌లోకి ప్రవేశించిన వేళ ప్రయాణాలకు ప్రణాళిక చేసుకుంటున్న వినియోగదారుల అవసరాల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి. మారుతున్న ఈ పర్యావరణ వ్యవస్థలో, నూతన ప్రమాణాలతో కూడిన నిర్వహణా ప్రమాణాలతో పాటుగా ఆతిథ్య రంగ పరిశ్రమలోని వ్యాపారవేత్తల కోసం పలు వ్యాపార అవకాశాలు మరియు విప్లవాత్మక సవాళ్లను తీసుకువచ్చింది.
 
వైజాగ్‌ నుంచి రవిగా ప్రసిద్ధి చెందిన లంకపల్లి ఉమా రామ లింగేశ్వరరావు ఈ తరహా విజనరీలలో ఒకరు. వ్యాపారవేత్తగా మారడమే తన అంతిమ లక్ష్యం అని నిర్ణయించుకున్నారు. యుక్తవయసులో అతను పైలెట్‌ కావాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల, అది సాధ్యం కాలేదు. హైదరాబాద్‌లోని జవహార్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ నుంచి 2009లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తరువాత, జార్ఖండ్‌లోని టాటా వైర్‌లెస్‌ టెలిసర్వీసెస్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీగా రవి పనిచేశారు.
 
కేవలం 18నెలల్లోనే ఆయన డాటాను విశ్లేషించడం, పరిశోధనలను నిర్వహించడం మరియు పలువురు వాటాదారుల చేత అనుబంధాలను నిర్మించుకోవడం వంటి అంశాలలో అత్యంత కీలకమైన పాఠాలను నేర్చారు. ఉద్యోగ సమయంలో ఆయన నేర్చుకున్న ఈ అంశాలు ఇంజినీరింగ్‌లో విభిన్నమైన అంశాలను రవి స్వీకరించడంలో సహాయపడ్డాయి. తద్వారా అతను తన పరిధినీ విస్తరించుకున్నారు.
 
ఆర్ధికంగా స్వతంత్య్రంగా మారాలనే లక్ష్యంతో రవి, ఆతిథ్య రంగాన్ని ప్రత్యామ్నాయ కెరీర్‌గా మలుచుకుని వ్యాపారం ప్రారంభించారు. 2017లో తన స్నేహితుని సహాయంతో రవి, వైజాగ్‌ నగరంలో ఓ ప్రోపర్టీ ప్రారంభించారు. ఆ తరువాత కాలంలో అది హోటల్‌గా మారింది. అభిరుచితో పాటుగా తన సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే తపన కారణంగా, ఆయన తన మొట్టమొదటి ప్రోపర్టీ హోటల్‌ సీ ట్రీను ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌పై 2018వ సంవత్సరంలో ఉంచారు. ఇది చేసిన కొద్ది కాలంలోనే ఆయన హోటల్‌కు వినియోగదారులు వెల్లువలా రావడంతో పాటుగా ప్రోపర్టీ గురించి అత్యుత్తమ సమీక్షలనూ చేశారు.
 
ఆహ్లాదకరమైన వసతి అనుభవాలను తాము పొందామని అతిథులు తమ సమీక్షలలో వెల్లడించారు. తన మొదటి హోటల్‌ విజయవంతం కావడంతో, అందుబాటు ధరలలో, అత్యున్నత నాణ్యత కలిగిన వసతి సౌకర్యాలు అందించాలనే తపనతో, రవి ఇప్పుడు తన రెండవ హోటల్‌ను సైతం ప్రారంభించారు. అత్యంత అందమైన  కొండలు, చూపుతిప్పుకోలేనట్టి సముద్ర తీరాలకు ప్రసిద్ధి చెందిన వైజాగ్‌, అన్ని రకాల ప్రయాణీకులకూ వినూత్న అనుభవాలను అందిస్తుంది. రవి లాంటి స్వీయ ప్రారంభీకులకు నగరంతో పాటుగా దాని ప్రతిపాదనలు ఓ వరంగా నిలుస్తుంటాయి. ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ మద్దతుతో రవి ఇప్పుడు అత్యున్నత నాణ్యత కలిగిన స్టే ఇన్‌ అనుభవాలను అందిస్తున్నారు.
 
తన ప్రయాణం గురించి క్యాపిటల్‌ ఓ 45731 హోటల్‌ సీ ట్రీ అధినేత రవి మాట్లాడుతూ, ‘‘ ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడంలో ఉత్ర్పేరకంగా పనిచేయాలని తానెప్పుడూ కోరుకుంటుండేవాడిని. వ్యాపారవేత్తగా విజయం సాధించడమంటే, నా అభిరుచికి తగినట్లుగా ఆగకుండా స్ధిరంగా పనిచేయడమని నాకు అర్థం. ఆర్థికంగా స్వతంత్య్రంగా ఎదగాలని నేను కోరుకున్నాను. అయితే, నేనొక్కడినే ఈ రిస్క్‌ తీసుకోవడానికి భయపడ్డాను.  ఆ సమయంలోనే, నగరంలో ఓ హోటల్‌ను నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను అన్వేషించడం ప్రారంభించాను. 
 
ఆతిథ్య రంగంలో అసాధారణ మార్పులను ఈ బ్రాండ్‌ తీసుకువచ్చింది మరియు భారీగా ఉన్నటువంటి చిరు జాబితా హోటల్స్‌కు శక్తినీ అందించింది. ఇవన్నీ కూడా నాకు వారితో భాగస్వామ్యం చేసుకోవాలనేందుకు స్ఫూర్తి కలిగించాయి. ఆ తరువాత, నేను, నా స్నేహితుడు కలిసి వైజాగ్‌లో ఓ ప్రోపర్టీ ప్రారంభించాం. ఓయో యొక్క సహాయంతో, మేము మా ఇన్వెంటరీని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాము.
 
కోవిడ్‌ అనంతర ప్రపంచంలో కూడా  ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న ప్రాంతాల్లో 100కు పైగా రూమ్‌లను మేము నిర్వహిస్తున్నాము. నా విజయానికి కారణం నా స్నేహితులు, కుటుంబసభ్యులు మరియు మరల మరల మా హోటల్‌కు వస్తున్న అతిథులు. ఈ వ్యాపారాన్ని విజయవంతంగా మార్చడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు వారు. మా హోటల్‌కు శానిటైజ్డ్‌ స్టేస్‌ ట్యాగ్‌ ఉంది. మా అతిథుల భద్రత కోసం ఓయోతో కలిసి అవసరమైన అన్ని భద్రతా చర్యలనూ మేము తీసుకున్నాం’’ అని అన్నారు.
 
రవి లాంటి హోటల్‌ భాగస్వాముల నుంచి వస్తున్న మద్దతుతో ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తమ అతిథులకు సురక్షితమైన మరియు నాణ్యమైన అనుభవాలను అందించడానికి సరికొత్త ప్రమాణాలతో కూడిన నిర్వహణ చర్యలను తీసుకువచ్చింది. ఓయో యొక్క కో-ఓయో యాప్‌, తమ భాగస్వాములందరికీ తమ పనితీరు, ధరలు, సమీక్షలుపై పూర్తి విజిబిలిటీని అందించడంతో పాటుగా చాట్‌ సపోర్ట్‌, స్వీయ సహాయ విభాగం మరియు సపోర్ట్‌ టిక్కెట్‌ సెంటర్‌తో ఆధునీకరించబడింది.
 
గత ఏడు సంవత్సరాలుగా, ఈ ఆతిథ్య రంగ గొలుసుకట్టు సంస్థ వందలాది సూక్ష్మ వ్యాపారవేత్తలకు భారతదేశంలో శక్తిని అందించడంతో పాటుగా ఉపాధి కల్పన చేయడంలో వారికి సహాయపడింది. ఓయో యొక్కవ్యాపార ప్రతిపాదన, సాంకేతికతపై ఆధారపడటంతో పాటుగా తమ సేవా సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. తద్వారా కార్యకలాపాలను సరళీకృతం చేసి స్థిరమైన, అత్యున్నత నాణ్యత కలిగిన ఎగ్జిక్యూషన్‌తో ప్రత్యామ్నాయ కెరీర్‌ ఎంపికలను అనుసరించడంలో హోటల్‌ యజమానుల విజయానికి దోహదం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు