శ్రీ గణేశవ్రతములు

శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (13:59 IST)
WD PhotoWD
*``కలౌ చండీ వినాయకా`` కలియుగంలో వెంటనే అనుగ్రహించే దేవతలు దుర్గ మరియు గణపతి మాత్రమే అని శాస్త్ర వచనం.
* శ్రీగణేశునికి సంబంధించిన ఉపాసన, సాధన, మంత్ర, తంత్ర విధానాలు, సాహిత్యం అన్ని `గాణపత్యం` అను పేరుతో ప్రసిద్ధమయినవి.
* 'చతుర్ధీ పూజనప్రీత': చతుర్ధీ (చవితి) తిథి గణపతికి ప్రతీతి. ఆ తిథినాడు ఆయన ఉద్భవించినాడు. సర్వ దారిద్ర్యాలు, భయరోగాది కష్టాలూ హరింపజేసే వినాయకుడి ప్రీతికంగా చతుర్థీ వ్రతం చెప్పారు.
* కృష్ణ చతుర్ధీ వ్రతం రోజున తెల్లవారుజామున లేచి గణేశుని స్మరించి స్నానాదులు చేసుకొని గణపతి మంత్రమును 108 సార్లు ధ్యానించి, గణేశ స్తోత్రములు పారాయణ చేయవలెను.
* ఆరోజు ఉపవాసం ఉండి పరుండాలి. ఆనాటి సాయంత్రం వినాయకుని షోడశాపచారాలతో పూజించి ఉండ్రాళ్లు, లడ్లు, బెల్లం, మోదకాలు మొదలగు పదార్థమలు నివేదించాలి.
* ముఖ్యముగా 21 ఉండ్రాళ్ళు నివేదన చేస్తే అన్ని దోషాలు పోతాయి. అంతేకాక బిల్వ పుష్పాలతో పూజించాలి.
* ప్రధానంగా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి చాలా ముఖ్యం.
* కృష్ణ చతుర్ధి వ్రతాన్ని చంద్రోదయముతో తిధిగా ఉండాలి.
* పూజానంతరం ``ఓం గం గణపతయే నమః`` అను మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది.

వెబ్దునియా పై చదవండి