షోడశ గణపతుల ధ్యానాలు

శుక్రవారం, 14 సెప్టెంబరు 2007 (15:15 IST)
PTI PhotoPTI
1. బాలగణపతి ధ్యానం
ోIII కరస్థ కదళీచూత పనసేక్షు కపిత్థకం,
బాలసూర్యప్రభం దేవం వందే బాలగణాధిరపం.
ాIII అరటిపళ్ళ గెలను, మామిడి, పనస, వెలగ పండ్లను, చెరుకుగడను నాలుగు చేతులతోను, తొండముతో ధరించి బాలభాస్కర ప్రభలతో భాసిల్లునట్టి బాల గణాధిపతికి నమస్కరిస్తాను.

2. తరుణ గణపతి ధ్యానం
శ్లోIII పాశాంకుశాపూప కపిస్థజంబూ ఫలం
తిలాం చేక్షు మపిసన హస్తైః,
ధత్తే సదాయ స్తరుణారుణాభః
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశః.
ాIII పాశాంకుశ మోదక కపిత్థ జంబూ ఫలాలనూ, తిలాపూపాన్నీ, తొండంతో ప్రత్యేకించి చెరకుగడనూ ధరించి ఆరు భుజాలతో, ఎర్రటి కాంతులతో శోభిల్లునట్టి తరుణ గణపతి మిమ్మల్ని సంరక్షించును గాక!

3. భక్త విఘ్నేశ ధ్యాన
శ్లోIII నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం,
శరచ్చశాంక సదృశం భజే భక్తగణాధిపం.
ాIII నారికేళ, చూత, కదళీ ఫలాలనూ, గుడమి శ్రితపాయస పాత్రనూ ధరించి, తెల్లటి కాంతులతో భాసిల్లుతూ భక్తుల అభీష్టాలను నెరవేర్చు వాడైనట్టి భక్తగణపతిని నేను సేవిస్తాను

4. వీరవిఘ్నేశ ధ్యాన
శ్లోIII బేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ -
ఖట్వాంగ ముద్గర గదాంకుశ పాశహస్తాన్,
శూలంచ కుంత పరశుధ్వజ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి
ాIII బేతాళశక్తి శర కార్మక ఖేట ఖడ్గ ఖట్వాంగ ముద్గర, గద, పాశ, అంకుశ శూల పరశు ధ్వజాలతో భాసిల్లుతూ చతుర్భుజాలతో ``సిందూర`` నామక రాక్షసుణ్ణి సంహరించినట్టి సిందూర వర్ణంతో ప్రకాశించునట్టి వీరవిఘ్నేశుని నేను స్మరిస్తాను.

5. శక్తిగణపతి ధ్యాన
శ్లోIII ఆలింగ్య దేవీం హరితాం విషణ్ణాం,
పరస్పరాశ్లిష్టక తీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయపహం శక్తి గణేశ మీడే.
ాIII కనక ప్రభలతో తేజరిల్లుతూ, అనేకమైనట్టి దేవిని ఆలింగనం చేసుకోడంలోని హస్త, అభయ పాశాంకుశాలను ధరించినట్టీ, దేవిచే కౌగిలింపబడినట్టీ, అరుణ కాంతి కలిగినట్టీ శక్తి గణపతిని నేను ధ్యానిస్తాను.

6. ధ్వజగణపతి ధ్యాన
శ్లోIII యః పుస్తకాక్ష గుణదండకమండలు శ్రీః,
నిర్వర్త్య మాన కరభూషణ మిందు వర్ణం
స్తంభేరమానవ చతుర్భుజ శోభమానం
త్వాం సంస్మరేతి ధ్వజగణాధిపతిం స ధన్యః.
ాIII పుస్తక అక్షమాల దండ కమండలాలతో కూడి వివధ రత్నాంచిత కర బాహు భూషణాలతో ప్రకాశించే చతుర్భుజాలతో ఒప్పుతూ, ధవళ ప్రభలతో భాసిల్లే ధ్వజగణపతిని సేవించునట్టివాడు ధన్యుడువుతాడు.

7. పింగళ గణపతి ధ్యాన
శ్లోIII పక్వచూత ఫల కల్పమంజరీ
మిక్షురసాతల మోదకైస్సహ,
ఉద్వహన్పరశు హస్త తే నమః-
శ్రీ సహాయయుత దేవ పింగనళ.
ాIII తొండంతో ఆమ్ర ఫలాన్నీ, నాలుగు చేతులలో కల్ప పుష్పగుచ్ఛ, ఇక్షు ఖండ, చిమ్మిలతో కూడిన మోదక, పరశువులను ధరించీ, లక్ష్మీ సహాయుడైయున్నట్టి పింగళ గణపతి! నీకు నమస్కారము.

8. ఉచ్ఛిష్ట గణపతి ధ్యాన
శ్లోIII లీలాబ్జం దాడిమం వీణా శాలి గుంజక్ష సూత్రకం,
దథ దుచ్చిష్ట నాయాయం గణేశః పాతు మేచకః.
ాIII లీలా పద్మ, దానిమ్మపండు, వీణ, శాలి గుంజాక్షమాలనూ చేతులలో ధరించినట్టి ఉచ్చిష్ట గణపతి నన్ను రక్షించు గాక!

9. విఘ్నరాజ గణపతి ధ్యానం
శ్లోIII పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాక్షువాహనః,
విఘ్నం నిహతు నః సర్వం రక్తవర్ణో వినాయకః.
ాIII పాశాంకుశ అభయ, ఆమ్ర ఫలాలను ధరించినట్టీ, రక్త వర్ణాంచితుడైనట్టీ, మూషిక వాహనుడైనట్టీ, విఘ్నరాజు మా విఘ్నాలను పారద్రోలు గాక!

10. క్షిప్రగణపతి ధ్యాన
శ్లోIII దంతం ప్రకల్పలతా పాశ రత్న కుంభోవ శోభితం,
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం.
ాIII దంత, పాశ, కల్పలత, రత్న కుంభాలతో శోభిల్లునట్టి, అరుణ ప్రభలతో మనోహరుడైనట్టీ క్షిప్ర గణపతిని నేను ధ్యానిస్తాను.

11. హేరంబ గణపతి ధ్యాన
శ్లోIII అభయ వరద హస్తః పాశదంతాక్షమాలః
పరశుమథ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహః పంచమాతంగ వక్త్రః
కనక రుచిక వర్ణః పాతు హేరమ్బ నామా.
ాIII తొండంతో మోదకాన్నీ, అష్టభుజాలతో అభయ, వరద, పాశ, దంత, అక్షమాల, పరశు, త్రిశూల, ముద్గరాలనూ ధరించి, పంచగజ వదనుడై, సింహవాహనుడైనట్టి హేరంబ గణపతి మిమ్మల్ని రక్షించు గాక!

12. లక్ష్మీగణపతి ధ్యాన
శ్లోIII బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్,
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోతస్సరో నిస్సర:,
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవి చయస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహన్.
ాIII తొండంతో మాణిక్య కుంభాన్నీ, హస్తాలలో శుకదాడిమీఫల, కమల, అంకుశ, పాశ, కల్పతరు, ధనుర్బాణాలనూ దాల్చి, కమల హస్త అయిన లక్ష్మితోనూ, వరద అభయాది పదిచేతులతోనూ, గౌరవర్ణంతోనూ ప్రకాశించునట్టి `మహాగణపతి` అన్న పేరు గల లక్ష్మీగణపతి మమ్మల్ని రక్షించు గాక!

WD PhotoWD
13. మహాగణపతి ధ్యానం
శ్లోIII బిభ్రాణోజ్జక బీజ పూరక గదా దంతేక్షు బాణైస్సమం,
బిభ్రాణో మణికుంభశాలి కిణిశం పాశం చ వక్త్రాంచితం.
గౌరాంగ్యారుచి రారవిదయుతయా దేవ్యా సనాథాంతికః
శోణాంగ శ్శుభమాతనోతు భవతాం నిత్యం గణేశో మహాన్.
ాIII మాణిక్య కుంభంతో కూడిన తొండమూ, పద్మ, దాడిమీఫల, గద, దంత, ఇక్షు, బాణ, శాలిమంజరి, పాశ, అభయ దేవ్యాలింగితహస్త, హస్తంతోనూ అరుణ వర్ణాంచితుడైనట్టి స్వామి మీకు శుభాలను చేకూర్చును గాక!

14. భువనేశ గణపతి ధ్యాన
శ్లోIII శంఖేక్షు చాప కుసుమేషు కుఠారదంత -
పాశాంకుశైః కళమమంజరికా సనాథైః
పాణిస్థితైః పరిసమావృత భూషణ శ్రీః
విఘ్నేశ్వరో విజయతే కమనీయ గౌరః
ాIII శంఖ, ఇక్షుచాప, పుష్పబాణ, పరశు, దంత, పాశ, అంకుశ, కదంబ పుష్ప గుచ్ఛాలను ధరించి నానా రత్నాభరణాలతో భాసిల్లునట్టీ ధవళ ప్రభలతో భాసిల్లునట్టీ భువనేశ గణపతి విజయాలను ప్రసాదించునుగాక!

15. నృత్య గణపతి ధ్యానం.
శ్లోIII పాశాంకుశాప కూఠార దన్త చంచత్కరం చారుతరాంగుళీయం,
పీతప్రభం కల్పతరో రథస్థం భజామి నృత్తైక పదం గణేశం.
ాIII తొండంతో మోదకాన్నీ, చతుర్భుజాలతో పాశాంకుశ పరశు దంతాలనూ ధరించి ప్రకాశిస్తూ కల్పవృక్షం యెక్క అధో భాగంలో నృత్య విన్యాసంతో ఒప్పే పాదాలు కలిగి పీత వర్ణంతో భాసిల్లునట్టి నృత్య గణపతిని నేను సేవిస్తాను.

16. ఊర్థ్వ గణపతి ధ్యాన
శ్లోIII కల్హరిశాలి కిణిశేక్షుక చాప బాణ,
దంత ప్రరోహ కబరః కనకకోజ్జ్వలాంగః,
ఆలింగనోద్యత కరః తటిదాభకట్యా
దేవాద్యతి శతృభయ మూర్థ్వ గణేశ్వరన్తే.
ాIII కలువ పువ్వు, శాలింజరి, ఇక్షుచాప బాణ, అభయ హస్తాలతో ఒప్పుతూ, దంతంతో, కనకోజ్వలాంగుడై, తటిద్వార్ణాచియైనట్టి దేవిని ఆలింగనం చేసుకోటడంలో వినియోగింపబడినట్టి ఆరు భుజాలు కలిగినట్టి ఊర్థ్వ తాండవ సంపన్నుడైనట్టి గణపతి అభయ ప్రదానం చేసి రక్షించును గాక!