అశ్వని నక్షత్రములో పుట్టిన జాతకులు ధరించాల్సినవి!

బుధవారం, 14 సెప్టెంబరు 2011 (17:25 IST)
FILE
అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులు ధనార్జన కోసం వజ్రమును ఉంగరపు వేలుకు ధరించగలరు. అలాగే ముత్యమును ఉంగరపు వేలుకు ధరించి కొత్త పనులు ప్రారంభిస్తే అనుకున్న పనులు విజయవంతమవుతాయి. మానసిక ప్రశాంతత లభించును.

గోమేధికమును మధ్యవేలుకు ధరిస్తే చేస్తున్న కార్యముల్లో అడ్డంకులు తొలిగిపోతాయి. అకాల నిద్ర తొలగిపోవును. ఇక నీల రత్నాన్ని మధ్యవేలుకు ధరిస్తే వ్యాపార లావాదేవీలలో స్నేహాన్ని పెంపొందింపజేస్తుంది. కొత్త మిత్రులు చేకూరుస్తుంది. జాతిపచ్చను చిటికెన వేలుకు ధరిస్తే భార్యభార్తల మధ్య సన్నిహిత్వము పెరుగుతుంది.

ధరించకూడనవి:
అశ్వని నక్షత్రములో జన్మించిన జాతకులు కెంపు, పగడము, కనక పుష్యరాగమును ధరించకూడదని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కెంపు, పగడము, కనకపుష్యరాగమును ధరిస్తే ప్రమాదాలు, బాధలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి