గ్రహయుతి-రత్నధారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

శుక్రవారం, 29 ఆగస్టు 2008 (18:34 IST)
జన్నకారుల జాతక చక్రంలో శుభగ్రహం, పాపగ్రహలు సంచరిస్తున్నట్లైతే గ్రహయుతి రత్నమును ధరించి శుభఫలితాలను పొందవచ్చని రత్నశాస్త్రకారులు చెబుతున్నారు. ఈ రత్నధరించడానికి ముందుగా జన్మకారుల జాతక చక్రంలో శుభగ్రహంతోపాటు మరేతర గ్రహలైనా ఉన్నట్లైతే అవి శుభ గ్రహలా లేక పాపగ్రహలా అని తొలుత నిర్ణయించుకోవాలని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

జన్మచక్రంలో శుభగ్రహలున్నట్లైతే గ్రహయుతి రత్నాన్ని నిర్భయంగా ధరించవచ్చని, పాపగ్రహాలు కలిసివుందని తెలిస్తే, ఆ రెండు గ్రహల మధ్యలో ఉన్న దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు చెబుతున్నారు. రవి, చంద్రులు 12 డిగ్రీలు లోపల ఉన్నచో గ్రహయుతి ప్రభావము ఈ గ్రహాలపై ఉంటుందని, 12 డిగ్రీలు దాటినచో వాటిపై ఈ యుతి రత్న ప్రభావం రవి, చంద్రులకు ఏమాత్రం ఉండదని రత్నశాస్త్రకారులు పేర్కొంటున్నారు.

అలాగే గురు, శుక్ర, కుజ, బుధ, శని తదితర గ్రహలు ఎనిమిది డిగ్రీలలోపు ఉన్నచో యుతి ప్రభావము మిక్కిలిగా ఉండునని, వీటి మధ్య ఎనిమిది డిగ్రీలు దాటినచో ఈ రత్న ప్రభావం ఉండదని రత్నకారులు చెబుతున్నారు. జన్మచక్రంలో కుజ, శనుల కలయిక ఉన్నట్లైతే వాటి మధ్య దూరము ఎనిమిది డిగ్రీలు ఉన్నట్లైతే గ్రహయుతి ప్రభావం వల్ల నీలము ధరించకూడదని వారు వెల్లడిస్తున్నారు.

పాప గ్రహాలు ఉన్నప్పుడుకూడా జాగ్రత్తగా పరిశీలించి రత్నధారణ చేయాలని రత్నశాస్త్రకారులు వెల్లడిస్తున్నారు. రత్నధారణ విషయంలో గ్రహయుతి ప్రభావం చాలా జాగ్రత్తగా పరిశీలించి ధరించగలరని చెబుతున్నారు. పరశీలించకుండా రత్నధారణ చేసినట్లైతే చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రకారులు తెలుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి