దారిద్ర్య నాశన ఉంగరాన్ని ఎలా ధరించాలో తెలుసా!?

మంగళవారం, 29 మే 2012 (17:36 IST)
FILE
శ్లో|| తార తామ్ర సువర్ణానామ్ మర్క షోదశ కేందుభి:
పుష్యార్కే ముద్రికా కుర్యా త్త్రిప్త దారిద్ర్య నాశనీ
ఇదం పవిత్ర తర్జన్యామ్ ధారయంతి పదాద్విజా:

అనే మంత్రం పఠించి శుక్లపక్షమున ఆదివారముగానీ పుష్య నక్షత్రమున వున్న గురువారము గాని 12 భాగములు వెండి 16 భాగముల రాగి పది భాగములు బంగారము కరిగించి మూడు తీగలు వరుసగా వుంచి అతికించి ఉంగరము చేయాలి. పుష్యమి నక్షత్రము వున్న ఆదివారంగానీ, గురువారం గానీ ధరించాలి. దీని వలన దరిద్రము తొలగిపోవును.

ఈ ఉంగరాన్ని ధరించేటప్పుడు రత్నాల శాస్త్ర నిపుణులను సంప్రదించడం మంచిది. వారి సలహా మేరకు మీ జన్మ రాశికి తగ్గట్టు పై విధంగా ఉంగరము చేయించుకుని ధరించడం మంచి ఫలితాలనిస్తుంది. వెండి, రాగి, బంగారం నేటి కొలతలకు అనుగుణంగా రత్నాల శాస్త్ర నిపుణుల సలహా మేరకు ఉంగరం చేయించుకోవాలి.

వెబ్దునియా పై చదవండి