నవగ్రహాలు-నవరత్నాలు-ఫలితాలు: సూర్యభగవానుని అనుగ్రహం కోసం..?

శుక్రవారం, 8 జనవరి 2016 (13:09 IST)
సాధారణంగా రత్నాల శాస్త్ర నిపుణుల సూచనలు, సలహాల మేరకు నవరత్నాలను ధరిస్తుంటాం. అయితే నవరత్నాల్లో నవగ్రహాలకు ఏ రత్నం విశిష్టతనిస్తుందో.. ఏ రత్నాన్ని ధరిస్తే.. ఏ దేవుని అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ఈ క్రమంలో నవరత్నాలు- నవగ్రహాల జాబితాను పరిశీలిస్తే.. సూర్య భగవానుడి అనుగ్రహం కోసం.. మాణిక్యాన్ని ధరించాలి. 
 
అలాగే చంద్ర భగవానుడి అనుగ్రహం కోసం ముత్య రత్నాన్ని, గురు భగవానుడి అనుగ్రహం కోసం పుష్పరాగం, రాహువు కోసం గోమేధికం.. బుధగ్రహ అనుగ్రహం కోసం మరకత పచ్చ, శుక్ర భగవానుడి అనుగ్రహం కోసం వజ్ర రత్నాల్ని ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. 
 
ఇంకా కేతుగ్రహ అనుగ్రహం కోసం వైఢూర్యం, శని భగవానుడి అనుగ్రహం కోసం నీలం, కుజుని అనుగ్రహం కోసం పగడాన్ని ధరించడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. నవగ్రహాలకు సంబంధించిన నవరత్నాలను ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగి.. ఐశ్వర్యాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి