ఏ వ్రేలికి భర్త రత్నం ధరిస్తే భార్యకు లాభం?

బుధవారం, 11 జూన్ 2014 (21:45 IST)
సాధారణంగా నవరత్నాలను ధరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, రాశి చక్రంలో వక్రించిన గ్రహాన్ని ముందుగా గమనించాలి. తర్వాత వర్గోత్తము చెందిన గ్రాహానికి సంబంధించిన రత్నమును ధరించగలరు. రాశి చక్రంలో వక్రించిన పాప గ్రహానికి సంబంధించిన రత్నమును ధరించరాదు. ఒక రత్నమును ధరించినపుడు విరోధి రత్నాన్ని కలిపి ధరించరాదు. 
 
ఒక రత్నమును ధరించినప్పుడు మిత్ర రత్నాన్ని కలిపి ధరించగలరు. రాశి చక్రములో గ్రహ మహర్ధశ అంతర్థశ బలాన్ని గమనించాలి. పురుషుడు తన ఎడమ చేతిలో రత్నాన్ని ధరిస్తే భార్యకు లాభము కలుగుతుంది. స్త్రీ తన కుడిచేతిలో రత్నాన్ని ధరిస్తే భర్తకు లాభం చేకూరుతుంది. తర్జనీ వ్రేలుకు కనక పుష్యం, మధ్య వ్రేలుకు నీలం, అనామిక వ్రేలుకు కెంపు, కనిష్ట వ్రేలుకు జాతిపచ్చ, తర్జనీ వ్రేలుకు వజ్రం ధరించాలి.

వెబ్దునియా పై చదవండి