ఆ తరువాత చాలా కాలానికి చైనీయులు చెక్కతో గుజ్జు తయారుచేసి, దాన్ని బల్లపరుపుగా పరిచి, ఆరబెట్టి, కాగితాన్ని తయారు చేయడం ప్రారంభించారు. అదే పద్ధతిని అరబ్బులు ఇంకాస్త మెరుగుపరిచి, మెరుగైన కాగితాన్ని తయారు చేసారు.
పాపిరస్ నుంచి కాగితాన్ని తయారు చేయడమే కాకుండా చాపలు, బుట్టలు, తాళ్లు, చెప్పులు, పడవలు తయారు చేసేవారు. ఈ మొక్క వేరుని ఔషధంగానూ, ఆహారంగానూ, సుగంధద్రవ్యంగానూ ఉపయోగించేవారు.