రాత్రి అయ్యేసరికి మనిషికి నిద్ర అవసరమా?

గురువారం, 21 ఆగస్టు 2014 (15:41 IST)
సాధారణంగా ప్రతి వ్యక్తికి రాత్రి అయ్యేసరికి నిద్రవస్తుంది. ఇందులో చిన్నాపెద్దా అనే తేడా లేదు. నిజానికి నిద్ర అనేది ఆవహించకుంటే ఎంచక్కా 24 గంటల సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని అనుకునేవారూ లేకపోలేదు. అలాంటి నిద్ర మనిషికి ఎందుకు అవసరమో ఓసారి పరిశీలిస్తే.. 
 
నిద్ర పోకపోతే మనిషి జీవించలేడు. ఆహారం లేక పోయినా జీవించగలడేమో గానీ, ఒకటి రెండు రోజుల పాటు నిద్ర లేకుంటే మాత్రం మనిషి బతకడం కష్టం. అంటే మనిషి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో.. నిద్ర అనేది కూడా అంతే అవసరం. 
 
నిద్ర పోవడం వల్ల మనిషి శరీర బడలికను తగ్గించడమే కాకుండా, మెదడుకు విశ్రాంతినిస్తుంది. నిద్రపోయే సమయంలోనే మెదడు గతమంతా నెమరువేసుకుని ఏది దాచుకోవాలో.. ఏది వదిలించుకోవాలో అర్థం చేసుకుని, అవసరం అనుకున్న దాన్ని మాత్రమే దాచిపెట్టుకుంటుంది. మెదడుకు తగినంత విశ్రాంతి లేకపోతే.. మిగిలిన శారీరక అంగాలు కూడా సక్రమంగా పనిచేయవు. అందుకే కనీస నిద్ర అవసరం. 

వెబ్దునియా పై చదవండి