నిత్యం ప్రకాశించే ధృవతార మన "కల్పన"

అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని తన ప్రతిభాపాఠవాలతో విశ్వవ్యాప్తం చేసి కనుమరుగైన ధృవతార మన కల్పనా చావ్లా. ఆసియాలోనే అంతరీక్ష యాత్ర చేసిన మొదటి మహిళా వ్యోమగామిగా గుర్తింపు పొందిన భారతీయ సంతతికి చెందిన కల్పన జన్మదినాన్ని చరిత్రలో జూలై 1వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.

కల్పన జీవిత వివరాల్లోకి తొంగి చూస్తే... హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ గ్రామంలో 1961 జులై 1వ తేదీన భన్వరీలాల్‌, సంయోగిత దంపతులకు జన్మించారు. కర్నాల్‌లోని టాగోర్ పబ్లిక్ స్కూలులో ఆమె చిన్నతనంలో విద్యనభ్యసించింది. పంజాబ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంలో ఇదే విభాగంలో మాస్టర్స్‌ స్థాయి విద్యను అభ్యసించిన ఆమె ఉన్నత శిఖరాలకు ఎదిగారు.

విమానరంగంలో అత్యంత ఆసక్తి గల తన సోదరుడు సంజయ్‌ పలు రకాల విమానాల బొమ్మలను సేకరించగా వాటి నుంచి స్ఫూర్తిని పొందిన కల్పన ఈ రంగాన్ని తన లక్ష్యంగా చేసుకొని అనుకున్నది సాధించారు. అదే విధంగా భారత దేశంలో మొదటిసారి విమానాన్ని నడిపిన భారతీయుడు జె.ఆర్‌.డి.టాటా కూడా తన స్ఫూర్తి దాతగా కల్పన చెప్పుకునేవారు.
కల్పన అంటేనే "ధైర్యం"
  కల్పనా చావ్లా(41) అనే పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ధైర్యం. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన ఆమె... అంతరిక్షంలో ఏవేని చిన్న పొరపాట్లు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసిన ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించి మళ్లీ ఆకాశం..      


తొలిసారి 1997లో అంతరీక్ష యాత్ర చేసిన ఈ మొట్టమొదటి ఆసియా మహిళా వ్యోమగామి కల్పన... ఫ్రెంచి జాతీయుడైన విమాన రంగ నిపుణుడు జీన్‌ పియెర్రె హారిసన్‌ను పెళ్లి చేసుకున్నారు. కల్పన ఎంచుకున్న అంతరీక్ష రంగ మార్గాన్ని మొదట్లో వ్యతిరేకించి ఆమె వైద్య రంగాన్ని చేపట్టాలని ఆశించిన ఆమె తండ్రి భన్వారీలాల్‌ (వృత్తి రీత్యా వ్యాపారి) చివరకు కుమార్తె అభిమతాన్నే ప్రోత్సహించారు.

అమెరికా అంతరిక్షయాన సంస్థ అయిన "నాసా"లో వ్యోమగామి విధులు నిర్వహిస్తున్న కల్పన... 2003లో కొలంబియా అంతరిక్ష నౌకలో రోదసిలోకి వెళ్ళి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగాను, రెండో భారతీయ వ్యక్తిగాను పేరు సంపాదించింది. ఇదే కొలంబియా అంతరిక్షనౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం ఏడుగురు వ్యోమగాముల్లో కల్పనా చావ్లా ఒకరు కావడం విషాదకరం.

కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కి.మీ ఎత్తున ప్రయాణిస్తూ... మరో 16 నిముషాల కాలంలో కేప్‌ కెనవరాల్‌లోని కెనడీ అంతరీక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కొలంబియాలో ప్రయాణిస్తున్న కల్పనా చావ్లా (మిషన్‌ స్పెషలిస్టు) సహా మరో ఆరుగురు వ్యోమగాములు హజ్‌బెండ్‌ (కమాండర్‌), ఆండర్సన్‌ (పేలోడ్‌ కమాండర్‌), మెక్‌కూల్‌ (పైలట్‌), ఇలాన్‌ రామన్‌ (పేలోడ్‌ స్పెషలిస్టు), బ్రౌన్‌, క్లార్క్‌ (మిషన్‌ స్పెషలిస్టులు) ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాద సమయంలో గంటకు 20 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ వ్యోమనౌక విస్ఫోటనానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్‌తో పాటు మరో రెండు రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అయితే ఆ శకలాలు విషపూరిత రసాయనాలతో కూడినవి అయి ఉన్నందున పౌరులెవరూ వాటి చాయలకూ పోరాదని నాసా హెచ్చరించింది. కాగా... 40 ఏళ్లకు పైబడిన నాసా చరిత్రలో మానవ వ్యోమనౌక భూమికి తిరిగివస్తూ ఆపదకు గురికావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

కల్పనా చావ్లా(41) అనే పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ధైర్యం. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన ఆమె... అంతరిక్షంలో ఏవేని చిన్న పొరపాట్లు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసిన ఈ ధీశాలి మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించి మళ్లీ ఆకాశంలోకే పయనమైపోయారు. భౌతికంగా ఆమె మరణించినా, కొన్ని వేల సంవత్సరాల తరువాత కూడా కల్పన పేరు ఈ భూప్రపంచంపైన మార్మోగుతూనే ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి