ఆరోగ్యంగా ఉండాలా? అయితే శరీరంలో ఫాట్ తగ్గించుకోండి!

గురువారం, 6 ఫిబ్రవరి 2014 (17:10 IST)
FILE
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఫాట్ తగ్గించుకోవాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఫాట్‌ను తగ్గించుకుని, ఒబిసిటీకి చెక్ పెట్టడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చునని వారు సూచిస్తున్నారు. కానీ ఫాట్ తగ్గించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి.

* శరీరంలోని ఫాట్‌ను అదుపులో ఉంచుకునేందుకు గోరువెచ్చగా వేడి చేసిన పదిగ్రాముల పుదీనా రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరకడుపున సేవించాలి. దీంతో రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

* అలాగే పాలలో కనీసం మూడు గ్రాముల పసుపుపొడిని కలుపుకుని నిత్యం సేవిస్తుంటే ఫాట్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.

* ఉదయంపూట పరకడుపున వెల్లుల్లి పలుకులను సేవిస్తే కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు.

* మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఐదు నుంచి పది గ్రాముల నేరేడు గింజల చూర్ణాన్ని ఉదయం పూట సేవించాలి. కాకారకాయ రసం సేవిస్తే కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

* హృద్రోగంతో బాధపడేవారికి నిత్యం తక్కువ ఫాట్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోమని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. హృద్రోగంతో బాధపడేవారు ఆపిల్, దానిమ్మపండ్ల రసాలు, ఉసిరికాయ తీసుకున్నాకూడా గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే గుండె సక్రమంగా పనిచేస్తుందని వైద్యులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి