ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

FILE
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మనం తీసుకునే ఆహారం జీర్ణంకాక కడుపు ఉబ్బరించి, గాలి కడుపులో చేరితే అది అజీర్ణమవుతుంది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?
అన్ని రుచులలో కూడిన భక్ష్య, దూష్య, భోజ్వాది పదార్థములను అంటే లడ్డూలు వంటి తీపిపదార్థాలు. అన్నం , పప్పు వంటి గట్టి పదార్థాలు. తాగదగిన మజ్జిగ, చారు, ఫలరసాలు తీసుకోవాలి. భోజనంలో మొదట తీపి పదార్థాలు, తర్వాత పులుపు, ఉప్పు కలిపిన పదార్థాలు, చివర చేదు పదార్థాలు తినాలి.

భోజనం మొదటి ముద్దలో పాత ఉసిరిపచ్చడి, రాత్రి భోజనంలో పాత నిమ్మకాయ పచ్చడి తినడం క్షేమకరం. భోజనం చివర పెరుగు, మజ్జిగ, పాలు తీసుకోవాలి.

ఎంత ఆహారం తీసుకోవాలంటే.. గొంతు దాకా తినకూడదు. కడుపులో సగందాకా గట్టి ఆహారాన్ని, ఒక వంతు నీటిని, మిగతా వంతు ఖాళీగా వుంచుకుంటే మంచిది.

వెబ్దునియా పై చదవండి