క్యాన్సర్, ఫ్లూ వ్యాధులను దూరం చేసే క్యారట్!

క్యారట్‌ కంటికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పీచు పదార్ధాలతోబాటు పుష్కలంగా విటమిన్లు ఉండడం వల్ల క్యారట్‌ను రోజూ తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

తాజాగా క్యారట్‌నుండి తీసిన కొన్ని సమ్మేళనాలను ఉపయోగించి క్యాన్సర్‌, ఫ్లూ, హృదయ నాళాలకు సంబంధించిన వ్యాధులను, నాడీ క్షీణతను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఫ్లూ నివారణకు టామిఫ్లూను అనే మందును ఉపయోగిస్తుంటారు. ఈ మందును షిక్నిక్‌ ఆమ్లం నుండి తయారుచేస్తారు.

ఇది ఇప్పటి వరకూ మసాలా దినుసుల్లో వాడే అనాస పువ్వులోనే ఉంటుంది. తాజాగా క్యారట్‌నుండి కూడా ఈ షిక్నిక్‌ ఆమ్లాన్ని గ్రహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఆహారశాస్త్రంలో 2012కిగాను అమెరికా జాతీయ అవార్డు అందుకున్న జాకబో వెలాజక్వస్‌ నేతృత్వంలో జరుగుతున్న పరిశోధనల్లో క్యారట్‌నుండి తీసిన సహజ సమ్మేళనాలను ఉపయోగించి క్యాన్సర్‌, ఫ్లూ, గుండె నాళాలకు సంబంధించిన వ్యాధులను, నాడీ క్షీణతను నివారించవచ్చని కనుగొన్నారు.

వెబ్దునియా పై చదవండి