తైవాన్‌లో మసాజ్‌తో గిన్నిస్ రికార్డు

బుధవారం, 2 జులై 2008 (18:12 IST)
WD PhotoWD
పర్యాటక రంగంలో విశేషంగా ఆదరణ పొందుతున్న తైవాన్.. ఇటీవల మసాజ్ ఫీట్‌లో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా ఈ రికార్డు కోసం చిత్ర విచిత్రమైన ఫీట్లు చేయడం పరిపాటి. అయితే మసాజ్‌కు పెట్టింది పేరైన తైవాన్‌‍లో దీని ద్వారానే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. జపాన్, కొరియా దేశాలకు చెందిన పర్యాటకులు తైవాన్‌ అందాలను తిలకించేందుకు వచ్చారు.

వీరందరిని ఒక చోట చేర్చి, మసాజ్ చేసేందుకు ఒక స్టేడియాన్ని వేదికగా ఎంచుకున్నారు. మొత్తం రెండు వేల మంది పర్యాటకులకు కేవలం ఇరవై నిమిషాల్లోనే మసాజ్ పూర్తి చేసి, గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా.. ఇప్పటికే ఈ కళలో పదివేల మంది ఔత్సాహికులు ప్రత్యేక శిక్షణ పొంది ఉపాధి పొందడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి