నిద్రలేమితో బాధపడుతున్నారా..? మామిడి తినండి!

గురువారం, 6 ఫిబ్రవరి 2014 (16:59 IST)
FILE
మామిడి పండ్లను ఇష్టపడనివారు ఈ లోకంలో ఉండరంటే అతిశయోక్తికాదు. ఇదే మామిడి పండును తినాలన్నా కూడా కేవలం వసంత ఋతువులోనే తినాలి. ఇవి మళ్ళీ దొరకవు. వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. అదే మామిడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయంటున్నారు వైద్యులు. అవేంటో తెలుసుకుందాం..

శరీరం కాలినప్పుడు : మామిడి ఆకులను కాల్చి, బూడిద చేసి ఈ భస్మాన్ని కాలినగాయాలపై చిలకరించండి. దీంతో కాలిన గాయం మానుతుంది.

నిద్రలేమి : నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునేముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్రపడుతుందని వైద్యులు అంటున్నారు.

కడుపులో నులిపురుగులుంటే : పిల్లలకు తరచూ నులిపురుగుల సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యనుంచి ఉపశమనం కలగాలంటే మామిడి ముట్టిని చూర్ణంలా చేసుకుని వేడినీటిలో కలిపి ఇస్తే నులిపురుగుల సమస్యనుంచి ఉపశమనం మటుమాయం అంటున్నారు వైద్యులు.

దంతాలు గట్టిగా ఉండాలంటే : మామిడి తాజా ఆకులను బాగా నమలండి. నమిలినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. దీనిని ఉమ్మేయండి. ఇలా నిత్యం చేస్తుంటే దంతాలు కదులుతుంటే దృఢంగా తయారవుతాయి. అలాగే చిగుళ్ళనుంచి రక్తం కారుతుంటేకూడా తగ్గుదల కనపడుతుందంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి