పరగడుపున నీటిని తాగండి.. వ్యాధులకు చెక్ పెట్టండి

గురువారం, 28 ఫిబ్రవరి 2013 (16:43 IST)
FILE
నీటిని రోజుకు ఎనిమిది గ్లాసుల వరకు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటూవుంటారు. అయితే నీటిని తాగడం ద్వారా కొన్ని వ్యాధులను దూరం చేసుకోవచ్చునని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. దీంతో ప్రతీరోజూ నిద్రలేచిన వెంటనే పరగడుపున నీరు తాగే అలవాటు జపాన్‌లో పాపులర్ అవుతోంది.

తలనొప్పి, శరీర నొప్పులు, గుండెపోటు, ఎముకల సంబంధిత వ్యాధులు, మూర్ఛ, చర్మ వ్యాధులు, ఆస్తమా, టీబీ, కిడ్నీ సంబంధిత రోగాలు, వేవిళ్లు, దంత సమస్యలు, డయాబెటిస్, కంటి రోగాలు, క్యాన్సర్, నెలసరి సమస్య వంటి వివిధ సమస్యలకు నీటి ద్వారా వంద శాతం చెక్ పెట్ట వచ్చునని జపాన్ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.

నీటిని ఎలా తాగాలంటే ?
1. నిద్రలేచిన వెంటనే పళ్లు తోమకముందే 4 X 160 మిల్లీ గ్లాసుల నీటిని తీసుకోండి.
2. బ్రష్ చేసుకున్న 45 నిమిషాలకు తర్వాత టిఫిన్ లేదా కాఫీ, టీలాంటివి తీసుకోకూడదు.
3. 45 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోవచ్చు.
4. అల్పాహారానికి 15 నిమిషాల తర్వాత, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్‌కు రెండు గంటల ముందు ఎలాంటి జంక్‌ఫుడ్ తీసుకోకూడదు. లంచ్, డిన్నర్‌కు రెండు గంటల ముందు నాలుగు గ్లాసుల నీరు తీసుకుండి.

ఇలా క్రమం తప్పకుండా నీరు తీసుకుంటే..?
హైబీపీ-30 రోజుల్లో,
నోటి పూత- పది రోజుల్లో
డయాబెటిస్ - 30 రోజుల్లో
మలబద్ధకం - పది రోజుల్లో
క్యాన్సర్ -180 రోజుల్లో
టీబీ- 90 రోజుల్లో నియంత్రిస్తుంది. అంతేగాకుండా నీటిని సేవిస్తే చలాకీగానూ, ఆరోగ్యవంతంగానూ ఉంటారని జపాన్ శాస్త్రవేత్తలు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి