పుట్టగొడుగుతో రక్తపోటును నియంత్రించుకోండి!

శనివారం, 23 ఫిబ్రవరి 2013 (13:36 IST)
FILE
పుట్టగొడుగులో అనేక పోషకవిలువలు ఉన్నాయి. హెపటో ప్రోటెక్టివ్, కార్డియో ప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫెక్టివ్ గుణాలు కూడా ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపణయింది.

కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువుగా, ఫైబర్ పాళ్లు ఎక్కువుగా, ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటును నియంత్రించే పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే సెలీనియం పుట్టగొడుగులో లభిస్తుంది.

ఈ పుట్టగొడుగుల్ని వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇంకా రక్తపోటును నియంత్రించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులను మష్రూమ్ దూరం చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి