మీ ఆరోగ్యం... ఇవి నిజాలు అనుకుంటారు కానీ కానేకాదు...

మంగళవారం, 8 అక్టోబరు 2013 (20:06 IST)
WD
చాలామందికి సౌందర్య పోషణ, శారీరక జాగ్రత్తలకు సంబంధించి కొన్ని అపోహలు నెలకొని వుంటాయి. అవి నిజమని నమ్మేసి వాటిని ఇంచుమించు అందరూ అనుసరిస్తుంటారు. వాటి గురించి తెలుసుకుందాం.

కీర దోస : కీరాను చక్రాల్లా తరిగి కళ్ళమీద వుంచుకుంటే కళ్ళకింద ఉబ్బులు తగ్గుతాయన్నది ఒక అపోహ, నిజానికి, కీరాలో 90 శాతం నీరు వుంటుంది. మిగతాది పీచు. ఇది ఏవిధంగానూ చర్మానికి మేలు చేయదు. అయితే ఫ్రిజ్‌లో వుంచిన కీరా చక్రాల్ని కళ్ళమీద వుంచుకోవడంవల్ల కూరగాయలోని చల్లదనం వాపును తగ్గిస్తుంది. చల్లని పరిశుబ్రమైన వస్త్రాన్ని కళ్ళపై వుంచుకున్నా ఇదే ప్రయోజనం కలుగుతుంది.

కొబ్బరి నూనె : తలకు నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందని, జుట్టు రాలడం తగ్గుతుందన్నది సాధారణ అభిప్రాయం. అయితే నూనెతో మసాజ్ వల్ల మేలు కలుగుతుంది. మునివేళ్ళతో మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

చిరుతిండ్లు : చిరుతిండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు, పొక్కులు వస్తాయనడానికి రుజువు ఏదీ లేదు. మొటిమలు బ్యాక్టీరియా, హార్మోన్స్, జెనిటిక్స్ కారణాల వల్ల వస్తాయి. అయితే చిరుతిండ్ల వల్ల శరీరంలో విషతుల్యాలు పెరగకుండా జాగ్రత్త వహించాలి.

వెబ్దునియా పై చదవండి