విరహవేదనా....ఆరోగ్యం జాగ్రత్త...!

యువత ప్రస్తుతం విరహవేదనలతో తెగ బాధపడుతుంటారు. కవితలు రాయడం, పాటలు రాయడం..చెలి..చెలికాడులతో ప్రేమాయణం సాగించడానికి ఉర్రూతలూగుతూ తమనుతాము మైమరచిపోతుంటారు. అలాంటి వారు ఒకానొక సందర్భంలో ప్రేమలో విఫలమైతే వారు విరహంలో మునిగిపోతుంటారు. అలా విరహంతో తెగ బాధపడుతుంటే ఆరోగ్యం దెబ్బ తింటుందని పరిశోధకులు తెలిపారు. ఇది చాలా వరకు గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

మనసు పరిపరివిధాలా పరుగులు తీస్తుందని, ప్రేమ విఫలమైతే విరహం తప్పదని, ఆ విరహానికి మరో మందు లేదంటున్నారు వైద్యులు. తమకు తాముగా మారి బాధను మరచిపోతే తప్ప ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేమని వారంటున్నారు.

విరహంలో మునిగిపోయినవారి ఆరోగ్యంలో చాలా మార్పులు సంభవిస్తాయని, ఇది జీర్ణక్రియ, గుండె, మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలినట్లు వైద్యులు తెలిపారు.

ముఖ్యంగా గుండెపోటుతో బాధపడినవారిని పరీక్షించినప్పుడు అత్యధికులందరూ చాలామటుకు ప్రేమలో విఫలమైనవారేనని వారు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి