సెక్స్‌లో కీళ్ల నొప్పుల అవరోధాలను అధిగమించేదెలా?

File
FILE
చాలా మందికి కీళ్ళ నొప్పులు వేధిస్తుంటాయి. ఇవి వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని రకాల వయస్సు వారికి వస్తుంటాయి. అయితే, యువకుల్లో కంటే.. వయస్సు పైబడిన వ్యక్తుల్లో ఈ నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి. నొప్పులు ఎక్కువగా ఉంటే సెక్స్‌లో పాల్గొనాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది.

ఒక్కోసారి భాగస్వాముల్లో సత్వర భావప్రాప్తి పొందడం జరగదు. దంపతుల మధ్య నమ్మకం ప్రేమ, రక్షణ పూరిత మనస్తత్వం ఉన్నప్పుడు శృంగారంలో నెమ్మది, ఓపికతో కూడిన ధోరణి, స్పర్శ గొప్ప సంతృప్తిని కలిగిస్తాయి. ముందు భాగస్వామికి కష్టం, నొప్పి, అసౌకర్యం కలిగించే వాటిని తొలగించుకుంటూ ఆనందాన్ని, సంతృప్తిని కలిగించే విషయాల్ని తెలుసుకుంటూ మెలగాలి. ఇది ఇద్దరి మధ్య ఉద్వేగాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

నిజానికి కీళ్ళ జబ్బు లైంగిక అవయవాల్ని అతి తక్కువగా దెబ్బతీస్తుంది. కాకపోతే, నొప్పివల్ల శృంగార అనుభూతి పొందలేని మానసిక స్థితికి చేరుకుంటారు. అది దంపతుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. వ్యాధి వల్ల మనిషి ఆకారంలో మార్పు, బరువు పెరగడం లేదా తగ్గడం, చురుకైన కదలికలు, శక్తి లేకపోవడంతో అవన్నీ ఆత్మ విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బతీస్తాయని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి