స్ట్రాబెర్రీలతో మీ గుండెను పదిలం చేసుకోండి.

శనివారం, 16 ఫిబ్రవరి 2013 (18:36 IST)
FILE
ఎర్రగా, నోరూరించేలా ఉండే స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఎన్‌ఆర్‌ఎఫ్2 అనే ప్రోటీన్‌ను ఉత్తేజపరచడం వల్ల కొవ్వు నియంత్రణలో ఉంటుందని లండన్‌ వార్‌విక్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచగల శక్తి స్ట్రాబెర్రీలకు ఉందని పరిశోధకులు తేల్చారు. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా అదుపు చేయవచ్చున్నది వారి విశ్లేషణ. అందుచేత రోజూ ఒక స్ట్రాబెర్రీ కుదరకపోతే.. వారానికి నాలుగు స్ట్రాబెర్రీలు తింటే మీ గుండెను పదిలం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి