అరటి ఆకులో తినండి నల్లటి కురులను పొందండి!

సోమవారం, 25 ఆగస్టు 2014 (18:09 IST)
అరటి ఆరోగ్యప్రదాయిని. అరటి మొక్క యొక్క అన్ని భాగాలను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. కాండాన్ని, పువ్వును వంటల్లో ఉపయోగిస్తారు. మొక్క నుండి పొందిన ఫైబర్‌ను త్రాళ్ళు, చాపలు, ముతక కాగితం, కాగితం గుజ్జు తయారుచేయటంలో ఉపయోగిస్తారు. అయితే అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
అవేంటో చూద్దాం... 
అరటి ఆకులో వేడి వేడిగా వడ్డించిన ఆహారం ఆరోగ్యకరమైనది. అరటి ఆకులో వేడి ఆహారం వడ్డించటం వలన ఆకులో ఉన్నముఖ్యమైన పోషకాలు ప్రసరిస్తాయి. వాటితో పాటు మనం ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
అరటి ఆకులో భోజనం చేయడం ద్వారా నల్లటి కురులు మీ సొంతం అవుతాయి. ఆకులో క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే బూడిద జుట్టుతో ఉన్నవారు నల్లనిజుట్టును పొందుతారు. అలాగే అరటి పండును క్రమం తప్పకుండా తీసుకుంటే రేచీకటికి చెక్ పెట్టవచ్చును. 

వెబ్దునియా పై చదవండి