బీట్‌రూట్‌లో దాగివున్న పోషకాలేంటో తెలుసా?

మంగళవారం, 22 జులై 2014 (16:21 IST)
బీట్‌రూట్‌లో దాగివున్న పోషకాలేంటో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. వేడి గాయం తగిలితే ఆ చోట బీట్ రూట్ రసం రాస్తే మంచి ఉపశమనలం లభిస్తుంది. ఇంకా గాయాలు త్వరగా ఆరిపోతాయి. రక్తహీనత, మలబద్ధకానికి బీట్‌రూట్ చెక్ పెడుతుంది. బీట్ రూట్ జ్యూస్ అజీర్తికి చెక్ పెడుతుంది. శరీరంలో రక్త కణాలు ఉత్పత్తి కావాలంటే.. బీట్ రూట్ ముక్కలను నిమ్మరసం కాంబినేషన్‌తో తీసుకోవాలి. 
 
బీట్ రూట్ ఉడికించిన నీటిలో వెనిగర్ కలిపి అలర్జీలు, చుండ్రు, మానని పుండ్లపై పూస్తే ఉపశమనం లభించడంతో పాటు పూర్తిగా నయం అవుతాయి. బీట్ రూట్, కొబ్బరి నూనె మిశ్రమం కూడా గాయాలపై బాగా పనిచేస్తాయి. బీట్‌రూట్‌లో 87.7% తేమ, పీచు 1.7శాతం, 0.1% కొవ్వు ఉన్నాయి. ఇంకా మేగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి